23వ రోజుకు చేరిన సిఐటియ జన విజ్ఞాన వేదిక భోజనం పంపిణీ కార్యక్రమం
పొదిలి పంచాయితీలోని నేతపాలెంలో నిరుపేదలు ,పంచాయితీ,మిల్లు కార్మికులకు 300 మందికి భోజనం సదుపాయాన్ని కల్పించారు. వివరాలు లోకి వెళ్ళితే స్థానిక గత 23 రోజులుగా పట్టణంలో పలు ప్రాంతాల్లో సిఐటియు మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పేదలకు భోజనం సదుపాయాన్ని కల్పించాటలో భాగంగా ఆదివారం నాడు ఉచిత భోజనాన్ని ఆల్ మొమిన్ కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్ కరస్పాండెంట్ మరియు లాల్ ఫౌండేషన్ చైర్మన్ ఆకీబ్ అహ్మద్ సహకారంతో 300మందికి ఏర్పాటు చేసామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపియం పశ్చిమ ప్రకాశంజిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ ,ఆల్ మొమిన్ కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్ కరస్పాండెంట్ మరియు లాల్ ఫౌండేషన్ చైర్మన్ ఆకీబ్ అహ్మద్ , జన విజ్ఞాన వేదిక పొదిలి డివిజన్ అధ్యక్షులు దాసరి గురుస్వామి , సిపియం పొదిలి ప్రాంతీయకమిటి కార్యదర్శి యం.రమేష్ ,ఆల్ మొమిన్ కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతినిధి ఖాశీం,అంగన్వాడి వర్కర్స్ &హెల్పర్స్ యూనియన్ పొదిలి ప్రాజెక్ట్ అధ్యక్షురాలు యం శోభారాణి నాయకులు పద్మ ,షమీమ్ నేతపాలెం యూత్ నాయకులు బండి అశోక్ ,బాను, బాస్కర్ ,బాలు సిఐటియు నాయకులు జి.సురేష్ ,యం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు