జెడ్పీ పాఠశాలకు శానిటేషన్ చేసిన నగర పంచాయతీ అధికారులు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నగర పంచాయితీ అధికారులు శానిటేషన్ నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలోని మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం ప్రక్కన ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పనిచేస్తున్న ఉపాధ్యాయుడుకు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ కావటంతో అప్రమత్తమైన అధికారులు సదరు ఉన్నత పాఠశాల నందు శానిటేషన్ నిర్వహించారు