ఇంటర్ పరీక్ష కేంద్రాని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పట్టణంలోని స్థానిక వీరిశెట్టి జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం స్థానిక దరిశి డియస్పి నారాయణ స్వామి రెడ్డి, పొదిలి సిఐ సుధాకర్ రావు యస్ఐ మల్లిఖార్జునరావు తహశీల్దారు భాగ్యలక్ష్మి లతో సమీక్షించి పలు సూచనలు చేశారు.
పరీక్షా కేంద్రాల వద్ద పొదిలి సీఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.