జ్వరాల సర్వే వేగవంతం చేయాలని కలెక్టర్ పోల ఆదేశం
వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామ సచివాలయం ని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయం సిబ్బందికి జ్వరాల సర్వే మరియు వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు.
అనంతరం గోగినేని వారి పాలెం గ్రామాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న సర్వే గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు ఎయన్ఎం ను అడిగి తెలుసుకున్నారు
జ్వరాల సర్వేలో పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలని సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకుని గ్రామంలో కోవిడ్ నియంత్రణకు కలిసికట్టుగా పనిచేయాలని గ్రామంలో వచ్చిన వారిని బయటకు తెలియకుండా ఇంటికి కట్టడి చేయాలని అన్నారు గ్రామ సచివాలయం పరిధిలో ప్రతిరోజు 45 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామంలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని ప్రతి ఒక్కరు కోవేట్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నరు
ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, ఉప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు షేక్ షాహిదా ఏఎన్ఎం కుమారి తదితరులు పాల్గొన్నారు