రుణ విముక్తి పత్రాలను పంపిణీ చేసిన కమీషనర్
పొదిలి నగర పంచాయితీ లోని నందిపాలెం, మాదాల వారి పాలెం,కంబాలపాడు, పొదిలి 3 వార్డు సచివాలయాలను పొదిలి నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ సందర్శించి లబ్దిదారులకు రుణ విముక్తి పాత్రలను పంపిణీ చేశారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారుల సంబంధించిన దస్త్రాల ప్రగతి నివేదికను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర పంచాయితీ పరిధిలో మొత్తం లబ్దిదారులను సమావేశం పరిచి అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని విజయవంతం చేసేందుకు సిబ్బంది కృషి చేయాలని కోరారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలు నిర్మించుకున్న పక్కా గృహాలకు పూర్తి హక్కులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
వై.ఎస్.ఆర్. ఆసరా, చేయుత వంటి పథకాలకంటే జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద అధిక రాయితీతో లబ్ది చేకూరుతుందని ఆయన వివరించారు.
పట్టణ ప్రాంతాల్లో రుణం పొంది గృహాలు నిర్మించుకున్న వారికి వడ్డి అధికమయిందన్నారు.
అలాంటి వారికి కేవలం రూ.15 వేలు చెల్లిస్తే వారికి రుణ మాఫీ కావడంతో పాటు ఇంటికి ఉచితంగా రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నారు.
ప్రతి సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుందని ఆయన తెలిపారు.
ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
రిజిస్ట్రేషన్ ద్వారా భూమి విలువ పెరుగుతుందని, విలువలో 80 శాతం వరకు బ్యాంకుల ద్వారా రుణం పొందే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, వార్డు సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు