నగర పంచాయితీ సిబ్బంది పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కమీషనర్
పొదిలి నగర పంచాయితీ కార్యాలయం నందు పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది ఇంటి పన్ను వసూలు చేసిన నగదును కార్యాలయంలో జమ చెయ్యకుండా సొంతానికి వాడుకున్నా వారిపై నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
4.5 లక్షల రూపాయలు నగదు స్వాహా అనే పొదిలి టైమ్స్ ఈ కథనానికి స్పందించిన పొదిలి నగర పంచాయతీ కమిషనర్ విచారణ చేపట్టి వారిపై పొదిలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం పై నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ ను సంప్రదించగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.