భూమి చదును పనులు అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు
పొదిలి చెరువుల అభివృద్ధికి కేంద్రం 3కోట్లు నిధులు మంజూరు:
బిజెపి ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు సిరిసనగండ్ల శ్రీనివాస్
కోట్లాది రూపాయల తో ఉపాధి హామీ పథకం ద్వారా పొదిలి పట్టణంలో నిర్వహించిన భూమి చదును అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం జరిగిందని ఒంగోలు పార్లమెంట్ కమిటీ భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు సిరిసనగండ్ల శ్రీనివాస్ అన్నారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలో స్థానిక మంజునాథ కళ్యణ మండపం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొదిలి పట్టణంలోని పెద్ద చెరువు కు 1కోటి 38లక్షల 50 వేలు చిన్న చెరువుకు 57లక్షల70 వేలు, దొడ్లేరు చెరువు 89 లక్షల రూపాయలతో చెరువు అభివృద్ధి కోసం కేంద్రం ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు జరిగాయని త్వరలో పనులు ప్రారంభం జరుగుతుందుని తెలిపారు
అదే విధంగా ఇటివల కాలంలో పొదిలి పట్టణంలో జరిగిన అనేక భూ ఆక్రమణలు మరియు ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది రూపాయల దోపిడీపై త్వరలో ప్రత్యక్ష ఆందోళనకు సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఒంగోలు పార్లమెంట్ కమిటీ నాయకురాలు శాసనాల సరోజినీ, నియోజకవర్గ నాయకులు చెన్నయ్య, పొదిలి మండల పార్టీ కన్వీనర్ మాకినేని అమర్ సింహా. మండల నాయకులు మాగులూరి రామయ్యా, ఏడుకొండలు, ఆకుపాటి లక్ష్మాణ, పందిటి మురళి తదితరులు పాల్గొన్నారు