రేపు పొదిలి మార్కెట్ యార్డుకు శంఖుస్థాపన
పొదిలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన భవనం నిర్మాణానికి సోమవారం నాడు శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి చేతులమీదుగా శంఖుస్థాపన జరుగుతుందని పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జి కోటేశ్వరి ఆదివారం నాడు ఒక ప్రకటన లో తెలిపారు.
పొదిలి మండలం తలమల్ల కోల్డ్ స్టోరేజ్ సమీపంలో ప్రభుత్వం కేటాయించిన భూమి నందు తొలిత ప్రహారీ గోడ నిర్మాణంకు శంఖుస్థాపన జరుగుతుందని ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు