మార్కెట్ యార్డు ప్రహారీ గోడకు శంఖుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎంఎల్ఏ కుందూరు

పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ప్రహారీ గోడకు మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి శంఖుస్థాపన చేసి అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు .
వివరాల్లోకి వెళితే పొదిలి మండలం అన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ప్రహారీ గోడ నిర్మాణం కోసం 60 లక్షల రూపాయలు అంచనా వ్యయం తో తలపెట్టిన ప్రహారీ గోడ నిర్మాణం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి సోమవారం నాడు శంఖుస్థాపన చేసారు.
తొలుత వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జి కోటేశ్వరి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డికి పూలమాలలు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జి కోటేశ్వరి, మండల రెవెన్యూ తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ, స్థానిక సర్పంచ్ లు పులి శ్రీలత, సిరిమల్లె శ్రీనివాస్ యాదవ్ , వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జుల రమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, కొత్తపులి బ్రహ్మ రెడ్డి , గూడురి వినోద్ కుమార్, మహిళా నాయకురాలు షేక్ నూర్జహాన్, షేక్ గౌసియా వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు