తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ తండ్రి మృతి
తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ తో తండ్రి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
విషయం తెలుసుకున్న పొదిలి సిఐ సుధాకర్ రావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు.
వివరాల్లోకి వెళితే కొనకనమీట్ల మండలం నాగంపల్లి గ్రామం నందు కసిబిసి పాపయ్య మద్యం సేవించి తన భార్య పాపులమ్మ పై కొడవలితో దాడి ప్రయత్నం చేయ్యడంతో కొడుకు వెంకటరాజు అడ్డుకొనగా ఇద్దరు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది ఈ దశలో తండ్రి పాపయ్య కుమారుడు వెంకటరాజు పై కొడవలి దాడి చెయ్యటం తో చాతీ పై గాయపడినట్లు తదుపరి కొడవలి తీసి పక్కన వెయ్యడం తో మద్యం మత్తులో ఉన్న తండ్రి పాపయ్య కొడవలి పై పడి గాయపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పూర్తి వివరాలు పొస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత సమగ్ర దర్యాప్తు లో అసలు విషయం వెలుగులోకి వస్తుయిని పొదిలి సిఐ సుధాకర్ రావు తెలిపారు.