పొదిలి పోలీసు స్టేషన్ నందు రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

ప్రకాశం జిల్లా పొదిలి పోలీసు స్టేషన్ నందు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సిఐ సుధాకర్ రావు ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ 1949 సంవత్సరం నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగంను రాజ్యాంగ పరిషత్ ఆమోదించి1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని 1975 లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం రూపొందిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పొదిలి యస్ ఐ శ్రీహరి, పోలీసు సిబ్బంది మరియు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు