4 కోట్ల రూపాయలతో లక్ష్మీనరసింహ దేవస్థానం నిర్మాణం

పొదిలి కొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానమును 4 కోట్ల రూపాయలతో గుడిని పునర్నిర్మాణం చేపట్టినట్లు మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పి డి సి సి బ్యాంక్ చైర్మన్ మరియు కొండేపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాదాసు వెంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం వెల్లడించారు.

శుక్రవారం నాడు స్థానిక పొదిలి కొండ లక్ష్మీ నరసింహ దేవస్థానంను మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, కొండేపి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇన్చార్జ్ మాదాసు వెంకయ్య సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాలకవర్గం మరియు పొదిలి,మర్రిపూడి భక్తులతో సమావేశంలో నిర్వహించి గుడి పునర్నిర్మాణం చేపట్టి పర్యాటకంగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట రెడ్డి, మరియు పొదిలి కొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానము పాలకవర్గ సభ్యులు, పొదిలి ,మర్రిపూడి మండలాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు