రెండు సంచలన తీర్పులను వెలువడించిన వినియోగదారుల ఫోరమ్ కోర్టు….. సెలెబ్రెటీలకూ చురకలు

విజయవాడ : కలర్స్ సంస్థ ప్రకటన చూసి మోసపోయిన ఓ వినియోగదారుడి ఫిర్యాదు మేరకు కలర్స్ సంస్ధకు రెండు లక్షల జరిమానా విధిస్తూ ఆ జరిమానాను వినియోగదారుల సంక్షేమ నిధికి అందజేయాలని విజయవాడ వినియోగదారుల న్యాయస్థానం తీర్పును వెలువరించింది. అలాగే కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన 74,652రూపాయల మొత్తానికి 9శాతంతో వెంటనే చెల్లించాలని ఆదేశించింది.

ప్రజలలో ఆదరణ కలిగిన రాశి,రంభ వంటి సెలెబ్రిటీలు ఇలాంటి తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదని….. ప్రజల్లోకి అవాస్తవాలను తీసుకెళ్లే ప్రకటనల పట్ల సినితారలు జాగ్రత్తగా ఉండకపోతే కొత్త చట్టం ద్వారా సెలబ్రెటీస్ కు కూడా జరిమానా విధించే అవకాశం ఉందని వినియోగదారుల న్యాయస్థానం జస్టిస్ మాధవరావు చురకలంటించారు…….

ఇక రెండవ తీర్పు విషయానికి వస్తే…… షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్ లలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుపై స్పందిస్తూ పార్కింగ్ నిమిత్తం పీవీఆర్ మాల్ వసూలు చేసిన 40రూపాయల పార్కింగ్ ఫీజును తిరిగి వినియోగదారుడికి చెల్లించాలని……. దీర్ఘకాలంగా పీవీఆర్ మాల్ ఉచిత పార్కింగ్ నిర్వహించకుండా ప్రేక్షకుల నుండి పార్కింగ్ రుసుము వసూలు చేయడాన్ని ప్రధాన బాధ్యత వహిస్తూ వినియోగదారుల సంక్షేమ నిధికి 5లక్షల రూపాయల జరిమాన విధిస్తూ… వినియోగదారుడి ఖర్చుల నిమిత్తం 5000చెల్లించాలని ఆదేశిస్తూ వినియోగదారుల న్యాయస్థానం జస్టిస్ మాధవరావు తీర్పునిచ్చారు.

ఇకపై హైకోర్ట్ ఉత్తర్వుల మేరకు మాల్స్&మల్టి ప్లెక్స్ లలో ఉచిత పార్కింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ కు అలాగే కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ కు ఆదేశాలు జారీచేశారు.