మట్టి ప్రతిమలు పంపిణీ చేసిన జనసేన పత్రి కోసం బారులు తీరిన ప్రజలు

కరోనా ఎఫెక్ట్…… ఇంటికే పరిమితమైన వినాయక చవితి కళకళ

*మట్టి ప్రతిమలు పంపిణీ చేసిన జనసేన

*పత్రి కోసం బారులు తీరిన ప్రజలు

కరోనా మహమ్మారి ప్రభావం వినాయక చవితి పండుగపై పడింది…… ప్రతి సంవత్సరం పట్టణంలోని పలు వీధుల్లో మండపాలు తోరణాలతో వివిధ రకాలైన ఆకృతులతో అంగరంగ వైభవంగా పూజలందుకునే గజాననుడు ఈ సంవత్సరం మాత్రం మునుపెన్నడూ ఊహించని విధంగా బొజ్జ గణపయ్య పూజలు ఇళ్లకే పరితమయ్యాయి.

ఈ సందర్భంగా వినాయక ప్రతిమలు మరియు పత్రి కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించే విధంగా పోలీసులు ఏర్పాట్లు చేశారు.

కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే పండుగ జరుపుకోవాలనే అధికారులు తెలపడంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పర్యావరణ కాలుష్య రహిత వినాయక మట్టి ప్రతిమలను జనసేన పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆదేశాల మేరకు మట్టి ప్రతిమలు పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేరుస్వాముల శ్రీనివాస్, హల్చల్ జహీర్, నాగార్జున యాదవ్, షఫీ తదితరులు పాల్గొన్నారు.