విద్యుత్ షాకుతో యువకుడికి తీవ్ర గాయాలు
విద్యుత్ షాక్ కు గురై యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే మండలంలోని సలకనూతల గ్రామం నందు పంచాయతీ వీధిలైట్లు అమర్చే క్రమంలో మర్రిపూడి మండలం గుండ్లసముద్రం గ్రామానికి చెందిన ఇంకొల్లు సుబ్బారెడ్డి (28)కి ప్రమాదవశాత్తు 11కెవి లైన్ తగిలి స్తంభంపై నుండి కిందపడగా తలకు తీవ్ర గాయమైంది. స్థానికుల సమాచారంతో క్షతగాత్రుడిని 108 వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.