లోకల్ ఛానెల్స్ యూనియన్ సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం

కేబుల్, లోకల్ మరియు యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ యూనియన్ సౌజన్యంతో పంచాయతీ కార్మికులకు అన్నదాన కార్యక్రమం గురువారంనాడు నిర్వహించారు.


వివరాల్లోకి వెళితే స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద లాక్ డౌన్ సందర్భంగా పెన్ పవర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం గురువారంనాడు కేబుల్, లోకల్ మరియు యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ యూనియన్ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో విలేఖరులు స్వయంగా వడ్డించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పేరూ శ్రీనివాసులు, ముల్లా సుల్తాన్ మోహిద్దీన్, పందిటి సునీల్, కె బి షాహిద్, షేక్ కాలేషా, బి లక్ష్మీ, వీర చంద్రశేఖర్, మాచర్ల యరగొర్ల, సురేష్, మచ్చా రమణయ్య తదితరులు పాల్గొన్నారు.