నేడు 29 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు
ఒంగోలు కోవిడ్ వైద్యశాల విడుదల చేసిన ఆదివారంనాడు మధ్యాహ్నం ప్రత్యేక కోవిడ్ బులిటెన్ సమాచారంలో పొదిలి పట్టణానికి చెందిన 25మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆదివారంనాడు మధ్యాహ్నం అధికారులు ప్రకటించారు.
అనంతరం సాయంత్రం నాటికి మరో నాలుగు కోవిడ్ కేసులు నమోదు అవడంతో వారిని కూడా పట్టికలో చేర్చి సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ లో ఆదివారంనాడు మొత్తం 29మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ప్రకటించారు.
వీరు మొత్తం వారం రోజుల క్రితం కోవిడ్ పరిక్షలకు హాజరై నమూనాలను ఇవ్వగా….. నేడు ఆదివారంనాడు 29మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం.
పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిని 108వాహనంలో ఒంగోలుకు తరలించారు.