పాక్షికంగా వామపక్షాల భారత్ బంద్
జనవరి 8న వామపక్షాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన భారత్ బంద్ పొదిలిలో పాక్షికంగా జరిగింది.
వివరాల్లోకి వెళితే బుధవారంనాడు వామపక్షాల నాయకుల పిలుపుమేరకు తెల్లవారుజామునుండే కార్మిక, కర్షక సంఘాల నాయకులు బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆర్టీసీ బస్టాండ్ నందు బస్సులను ఆపేందుకు యత్నించిన వామపక్షాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం కార్మిక, కర్షక సంఘాలతో కలిసి స్థానిక విశ్వనాథపురం నుండి దుకాణాలు మూయిస్తూ ర్యాలీగా బయలుదేరి పెద్దబస్టాండ్ చేరుకుని మానవహారం ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు లేక అప్పులలో కూరుకుపోయారని…. స్వామినాధన్ కమీషన్ సిఫారసులను లనుఅమలుచేసి రైతాంగాన్ని ఆదుకోవాలని……. కేంద్రప్రభుత్వం సిపియస్ ను రద్దుచేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని….. కనీసవేతనాలను కూడా అమలుచేయడంలేదని…… కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చేసే పనికి తగిన వేతనం అమలుచేయాలని అన్నారు.
స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెన్ఫట్స్ కల్పించాలని, అసంఘటితరంగ కార్మికులకు పియఫ్ గ్రాట్యుటి, పెన్షన్ తో కూడిన సామాజిక భద్రత చట్టాన్ని రూపొందించాలని కోరారు.
అనంతరం చిన్నబస్టాండ్ మీదుగా తహశీల్దార్ కార్యాలయంలో వద్దకు చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.