సిపియం సిపిఐ ఆద్వర్యం లో జాతీయరహదారిపై పాదయాత్ర

ప్రత్యేక హోదా సాధనకై వామపక్షలు జనసేన ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నాడు కొనకనమీట్ల మండలం కొనకనమీట్ల నందు పెట్రోల్ బంక్ వద్ద నుండి ఎంపిడిఓ కార్యలయం వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా సిపియం ప్రాంతీయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం విభజన హామీల అమలుకోసం ప్రకాశం జిల్లాలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని జాతీయ రహదారిపై పాదయాత్ర ప్రారంభించామని ప్రత్యేక హోదా సాధించే దాక తమ ఉద్యమం కొనసాగుతుందని అయిన అన్నారు ఈ కార్యక్రమంలో సిపియం పొదిలి ప్రాంతీయ కార్యదర్శి రమేష్ సిపిఐ కార్యదర్శి కె కోటేశ్వరరావు జనసేన అభిమానులు తదితరులు పాల్గొన్నారు.