ఇంటి నివేశన స్థలాలు పంపిణీ లో అక్రమాలపై విచారణ జరిపించాలని సిపిఐ డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇండ్లు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో అర్హులైన వారికి న్యాయం జరగలేదని పంపిణీ లో అక్రమాలు జరిగాయని వాటిపై విచారణ జరిపించాలని సిపిఐ మండల కార్యదర్శి కె వి రత్నం డిమాండ్ చేశారు
వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావును కలిసి ఇంటి నివేశన స్థలాలు పంపిణీ లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని అదేవిధంగా అర్హులైన వారికి న్యాయం చెయ్యాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు