అశ్రునయనాలతో సిపిఐ ప్రసాద్ అంతిమవీడ్కోలు
భారత కమ్యూనిస్టు పార్టీ పొదిలి ప్రాంతీయ నాయకులు మరియు విశాలాంధ్ర విలేకరి కామ్రేడ్ పిల్లుట్ల ప్రసాద్ (62) అంతిమవీడ్కోలు ఆదివారంనాడు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలో గత ఇరవై సంవత్సరాల నుండి సిపిఐ మరియు అనుబంధ సంఘాల్లో పనిచేస్తూ ప్రజల అభిమానం చూరగొన్న వ్యక్తిగా మరియు జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్ధాపక కార్యదర్శిగా మరియు నాయీబ్రహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులుగా పని చేశారు.
గతకొద్ది కాలం నుండి తీవ్ర అనారోగ్యంతో భాధ పడుతున్న ప్రసాద్ శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఆదివారం స్వగృహం నుండి హిందు శాసనవాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించి హిందూస్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నారాయణ, నియోజకవర్గ కార్యదర్శి అందే నాసరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సైదా, సిపియం నాయకులు ఎం రమేష్, తెదేపా నాయకులు షేక్ రసూల్, వైకాపా నాయకులు షేక్ రఫీ, గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు కె నారాయణ, భాస్కర్, సయ్యద్ ఇమాంసా,
సిపిఐ సానుభూతిపరులు షేక్ ఖాదర్ బాషా, దరిశి శివాజీ, తదితరులు పాల్గొన్నారు.