సిపిఐ నాయకులు ప్రసాద్ కన్నుమూత
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకులు మరియు విశాలాంధ్ర విలేకరి పిల్లుట్ల ప్రసాద్ (58) అనారోగ్యంతో మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకులు మరియు విశాలాంధ్ర విలేకరి పిల్లుట్ల ప్రసాద్ (58) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందారు. అఖిల భారత యువజన సమాఖ్య అధ్యక్షులుగా, సిపిఐ పట్టణ కార్యదర్శిగా, ప్రాంతీయ కార్యదర్శిగా, జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా, విశాలాంధ్ర విలేకరిగా, పని చేస్తున్న ఆయన పొదిలి ప్రాంతంలోని ప్రజలకు ముళ్ళ వైద్యశాల వైద్యులుగా సుపరిచితులే ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలలో పాల్గొని అనేక స్థానిక సమస్యల పరిష్కారంలో ముందడుగు వేసిన ఆయనకు ఆయనకు భార్య ముగ్గురు ఆడపిల్లలు కలరు. వారిలో ఇద్దరికి వివాహం అవగా ఒక ఆడపిల్లలకు వివాహం కావలసి ఉంది.
కాగా ఆయన బౌతిక ఖననం రేపు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.