ఉల్లి అక్రమ నిల్వల కట్టడిలో ప్రభుత్వం విఫలం : సిపిఎం ప్రాంతీయ కమిటీ కార్యదర్శి ఎం రమేష్
ఉల్లి ధరలను నియంత్రించాలని, ప్రతి కుటుంబానికి 5కిలోలు రేషన్ షాపుల ద్వారా కిలో25రూపాయలకు సరఫరా చేయాలని….. పెంచిన ఆర్టీసీ చార్జీలను రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఎం ప్రాంతీయ కమిటీ కార్యదర్శి ఎం రమేష్ డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే పొదిలి మండల రెవిన్యూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో సిపిఎం పొదిలి ప్రాంతీయ కమిటీ కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ …….. 73యేండ్ల స్వతంత్ర బారతదేశంలో ఎన్నడూ లేనివిదంగా ఉల్లి ధరలు 180రూ నుండి 200రూపాయలకు పెరిగాయని అన్నారు…… పెద్ద ఎత్తున ఉల్లిని గిడ్డంగులలో అక్రమంగా నిల్వలు చేసుకుని కృత్రిమ కొరత సృష్టించి పెద్ద వ్యాపారులు దోచుకుంటున్నారని అక్రమ నిల్వలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని….. దాని ఫలితంగా ఉల్లి కిలో200చేరుకుని పేద, మధ్యతరగతి ప్రజానికం ఉల్లిపాయలకు కూడా దూరమయ్యారని అన్నారు.
ఉల్లి అక్రమనిల్వలు వెలికితీసి ధరలను నియంత్రించాలని ప్రతికుటుంబానికి 5కిలోల ఉల్లిని రేషన్ షాపుల ద్వారా కిలో25రూపాయల చొప్పున సరఫరాచేయాలని డిమాండ్ చేశారు.
అసలే సంక్షోబంతో పనులు లేక పూట గడవక పేద, మధ్యతరగతి కుటుంబాలు సతమతమవుతుంటే రాష్ట్రప్రభుత్వం గోరుచుట్టుపై రోకటిపోటులా ఆర్టీసీ చార్జీలను కిలో మీటరుకు 10పైసల నుండి 20పైసలకు పెంచటానికి పూనుకోవడం దారుణమని…..ప్రతి కుటుంబంపై చార్జీల పెంపు ద్వారా నెలకు 500నుండి 2000రూపాయల అదనపు భారం పడుతుందని…… ఇటీవల మినపపప్పు ,కందిపప్పు ,వేరుశనగప్ప,నూనె, చింతపండు, బియ్యం రేట్లపెంపుదల ఒకవైపు….. వరుస కరువులు, పనులులేక ఆర్దిక ఇబ్బందులతో కునారిల్లుతున్న కుటుంబాలపై ఉల్లి ధరలు ఆర్టీసీ చార్జీలపెంపుతో మరోవైపు మరింత ఆర్దిక ఇబ్బందులలో కూరుకుపోతున్నారని అన్నారు.
ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ఉల్లిధరలు తగ్గించాలని ఆర్.టి.సి.చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని తహశీల్దార్ ప్రభాకరరావుకు వినతిపత్రాన్ని అందజేశారు.