వెలుగొండ ప్రాజెక్టు కు 1500 కోట్లు కేటాయించాలని సిపియం దర్నా

వెలుగొండ ప్రాజెక్ట్ కు 1500కోట్లు కేటాయించాలని కోరుతూ పొదిలి మండల రెవెన్యూ తహాశీల్ధార్ కార్యలయం వద్ద సోమవారం నాడు సిపియం ఆద్వర్యం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపియం కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ బడ్జెట్ లో వెలుగొండ ప్రాజెక్టు కు 1500 కోట్లు కేటాయించే విధంగా బడ్జెట్ సవరించాలని పొదిలి పెద్దచెరువును సమ్మర్ స్టోరేజిట్యాంకుగా మార్చే ప్రతిపాదనను ఆమోదించి పొదిలిలో నీటిసమస్యను పరిష్కరించాలని అప్పటివరకు ట్యాంకర్సుద్వారా నీటి సరఫరా చేయాలని ఆయన అన్నారు అనంతరం తహశీల్దారు.విద్యాసాగరుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపియం నాయకులు పి.చార్లెస్ కె.పేరిరెడ్డి జి.నరసింహరావు షేక్ లతీఫ్ షేక్ కరిమూన్ మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.