సి పి యస్ విధానం రద్దు చేయలని ధర్నా
సిపియస్ విధానం ని రద్దు చేసి పెన్షన్ విధానం అమలు చేయలని కోరుతూ పొదిలి మండల తహాశీల్ధార్ కార్యలయం వద్ద పెన్షన్ సాధన సమితి ఆద్వర్యం లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పొదిలి తాలూకా ఎన్జిఓ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ 2013లో కేంద్ర ప్రభుత్వం
పియఫ్ఆర్డిఎ చట్టం తీసుకొని వచ్చారని ఈ చట్టం ద్వారా 2004కు ముందు సర్వీస్ లో చేరిన ఉద్యోగులు కూడా సిపియస్ పరిధి లోకి వచ్చే ప్రమాదం ఉందని అదేవిధంగా 2004 సంవత్సరం జనవరి 1వ తేది నుండి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు సెప్టెంబర్ 1 నుండి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమలులోకి తెచ్చి 2013 చట్టం చేసి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుందిని ఆయన తక్షణమే సిపియస్ విధానంని రద్దు చేసి పెన్షన్ విధానం తీసుకొని రావలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లను ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పొదిలి తాలూకా ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులు హాజరయ్యారు