విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందించాలి – శాసనసభ్యులు కుందూరు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించే దిశగా అడుగులు వెయ్యాలని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.

మంగళవారం నాడు స్థానిక పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు మార్కాపురం నియోజకవర్గం స్థాయి యంగ్ మైండ్ ప్రతిభ పురస్కారాలు కార్యక్రమాన్ని నిర్వహించి విజేతలకు శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ సుధాకర్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈవి రంగయ్య, మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు