జిల్లా స్ధాయి క్రికెట్ విజేత పప్పు లెవెన్స్

జిల్లా స్ధాయి క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా పొదిలి పప్పు లెవన్స్ విజయం సాధించింది.

వివరాల్లోకి వెళితే కొనకనమిట్ల మండలం పుట్లూరివారిపాలెం గ్రామంలో గత 12 రోజులుగా జరుగుతున్న జిల్లా స్ధాయి క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఈ టోర్నీలో మొదటి బహుమతి 20వేల రూపాయలు పొదిలి పప్పు లెవన్స్, రెండవ బహుమతి 15వేలు పూట్లురివారిపాలెం యూత్, మూడవ బహుమతి 10వేలు పొదిలి జిలానీ లెవన్స్, నాలుగువ బహుమతి 5వేలు కొనకనమిట్ల జట్లకు బహుమతిగా పంపిణీ చేశారు.