విద్యుత్ తీగ తగిలి గేదెలు మృతి…
విద్యుత్ తీగ తగలడంతో రెండు గేదెలు మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు ఉదయం పోతవరం గ్రామానికి చెందిన బ్రహ్మయ్యకు చెందిన రెండు గేదెలు మేపుకు వెళ్తుండగా తెగి పడిన విద్యుత్ తీగలు తగలడం….. ఆ సమయంలో విద్యుత్ కూడా సరఫరా జరుగుతుండటంతో రెండు గేదెలు మృతిచెందాయి.
రెండు గేదెలు ఒకలక్షా యాభైవేల రూపాయలు విలువ ఉందని యజమాని బ్రహ్మయ్య తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన తీరును పరిశీలించి గేదెల యజమాని ఫిర్యాదును నమోదు చేసుకున్నారు.