సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తున్న బ్యాంకు సిబ్బంది
పొదిలి మండలం రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం ఆవరణలో శుక్రవారం నాడు హెచ్ డి యఫ్ సి బ్యాంకు సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రైవేటు రంగానికి చెందిన హెచ్ డి యఫ్ సి బ్యాంకు అనుబంధ సంస్థ హెచ్ డి బి ఆధ్వర్యంలో అవగాహన కల్పించేందుకు పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా ఐ యఫ్ సి కౌన్సిలర్ల జిలానీ మాట్లాడుతూ బ్యాంకు గురించి అవగాహన ఫేక్ కాల్స్ ద్వారా ఓటిపి అడగటం, మెసేజ్లు పంపడం, తప్పుడు మెసేజ్లును ఓపెన్ చేస్తే వచ్చే ప్రమాదం , వివిధ రకాలుగా జరిగే సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రతి రోజు పలు కూడలి ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నమని అన్నారు.