డెంగ్యూ అవగాహనా ర్యాలీని ప్రారంభించిన డాక్టర్ చక్రవర్తి
జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ అవగాహనా ర్యాలీని పొదిలి ప్రభుత్వ వైద్యశాల ప్రధాన వైద్యులు చక్రవర్తి పచ్చ జెండా ఊపి పారంభించారు.
వివరాల్లోకి వెళితే జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల నుండి ప్రారంభమైన ర్యాలీని పట్టణ ప్రధాన వీధుల గుండా అవగాహన నిర్వహిస్తూ కొనసాగించారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు డెంగ్యూ వ్యాధి లక్షణాలు డెంగ్యూ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు బ్రహ్మతేజ, షేక్ షాహిదా, రఫీ, సిబ్బంది సాయి లీలావతి, నారు శ్రీనువాసుల రెడ్డి, ఆరోగ్య పర్యవేక్షలు, ఆరోగ్య కార్యకర్తలు, మరియు ఆషా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.