ఐకానిక్ 2021 అవార్డును అందుకున్న దరిశి శివాజీ
ఆయుర్వేదంలో అన్ని రోగాలను నయం చేయవచ్చని అనుభవాలతో నిరూపిస్తున్న , అలాగే పూర్వీకుల నుండి వైద్య సేవలను అందిస్తున్న దరిశి శివాజీ కి మరో ఐకానిక్ 2021 అవార్డు ను నేషనల్ హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ ఫౌండర్ డాక్టర్ రాహుల్ పడాళ్వార్, చైర్మన్ గుంజన్ మెహతా అందజేశారు.
ఈ నెల 9వ తేదీన మహారాష్ట్ర నాగపూర్ లో, అలాగే ఢిల్లీలో మరియు తిరుపతి లో 7వ తేదీన జరుగు జాతీయ ఎంపిక అవార్డు లను మరో సారి కోవిడ్ ప్రభలడంతో బుధవారం కోవూరులోని కెవియస్ ఫంక్షన్ హాల్ లో జాతీయ ఆయుర్వేద సదస్సు ,ఆయుర్వేద ఐకానిక్ అవార్డు -2021 నిర్వహించన సదస్సులో ప్రకాశం జిల్లా పొదిలి పట్టణానికి చెందిన దరిశి శివాజీ చేస్తున్న ఆయుర్వేదం మూలికా రసౌషద ఔషదాలతో ఎంతో మందికి ఇతర రాష్ట్రాలలో రోగాలను నయం చేసినందుకు , వ్యాధులపై తీసుకోవలసిన జాగ్రత్తలు అవగాహన కల్పిస్తుందుకు గుర్తించి అవార్డును , ప్రశంసా పత్రం , మెడల్ ను దుశ్యాలవాలతో సత్కరించారు .
అలాగే మన భారతదేశ మొదటి ఉపాధ్యాయ మంత్రి వర్యులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జాతీయ అవార్డు ను యువతేజం ట్రస్టు షేక్ కరిముల్లా అందజేశారు.
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ఆయుర్వేదం అనేది తన వారసత్వంగా వస్తున్నదని మా పెద్దలు కారణంగానే నేను చేస్తున్నానని , నాకు ఇంత గుర్తింపు రావడానికి మా పెద్దలే కారణమని అన్నారు . నావంతు ఎల్లప్పుడూ ప్రజలకు వైద్య సేవలను అందిస్తానని తెలుపుతూ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా వుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని నెల్లూరు విశ్వంభర ట్రస్టు చైర్మన్ డాక్టర్ తాళ్ళూరి సువర్ణకుమారి, ప్రేమానంద్ ఖండారి, జై దేవ్ హితాకర్,న్యావల్ ఆఫీసర్ నరేంద్రకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.