ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పొదిలి తహశీల్దారుకు డీలర్ల అసోసియేషన్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.
వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల అసోసియేషన్ పిలుపు మేరకు గురువారంనాడు స్థానిక మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయంలో తహశీల్దారు హనుమంతరావుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల డీలర్ల అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.