పిడుగుపాటుకు మహిళ మృతి
పిడుగుపాటుకు మహిళ మృతిచెందిన సంఘటన గురువారం నాడు చోటుచేసుకుంది. వివరాలు లోకి వెళితే మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామం నందు పొలం లో పనులు చేస్తుండగా కూతవేటు దూరంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో భోదా మల్లీశ్వరి (32) అక్కడికి అక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు , రెవెన్యూ సిబ్బంది సంఘటన స్ధలం చేరుకొని సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు