గాయపడిన వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తు గాయపడిన వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే ఈ నెల 11వ తేది మంగళవారం నాడు స్ధానిక పంచాయతీ కార్యాలయం సమీపంలో నివాసం ఉండే దేవరకొండ వెంకయ్య(52) తన ఇంటి సమీపంలో ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడగా బంధువులు చికిత్స కోసం ఒంగోలు తరలించి అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.