అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పోలా

ప్రభుత్వం అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు.

వివరాల్లోకి వెళితే స్థానిక దరిశి రోడ్డులోని మంజునాథ కళ్యాణ మండపం నందు జరిగిన మార్కాపురం, సంతనూతలపాడు నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 1400పాఠశాలల్లో ప్రహారీ గోడలు , మరుగుదొడ్లు, జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద
మెటీరియల్ తో సిమెంట్ రోడ్లు , సిమెంటు కాల్వలు, గ్రామ సచివాలయాల అనుమతులు మంజూరు, ఇంటి నివేశన స్ధలాలు మరియు ‌వివిధ శాఖలకు సంబంధించి ప్రగతి సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి వివిధ శాఖల అధికారులు మరియు మార్కాపురం, సంతనూతలపాడు నియోజకవర్గాల సంబంధించిన మండల, గ్రామ సచివాలయల అధికారులు తదితరులు పాల్గొన్నారు.