పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన కై తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా

పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన కై మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు

పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా తహశీల్దారు కార్యాలయం వరకు బయలుదేరి ధర్నా చేపట్టారు

ఈ సందర్భంగా పొదిలి డివిజన్ సాధన సమితి నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ పేర్కొన్న ప్రకారం పొదిలి రెవిన్యూ డివిజన్ కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పొదిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు.

అనంతరం తహశీల్దార్ దేవ ప్రసాద్ కు వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన సమితి అధ్యక్షకార్యదర్శిలు గునుపూడి భాస్కర్, వరికూటి నాగరాజు, సాధన సమితి నాయకులు కాటూరి వెంకట నారాయణ బాబు కాటూరి నారాయణ ప్రతాప్, యర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పొల్లా నరసింహా యాదవ్ ,అమర్ సింహా,దర్నాసి పెద్దన్న, బండి అశోక్ అవూలూరి యలమంద, బాదుల్లా, కనకం వెంకట్రావు యాదవ్,వెల్పుల కృష్ణంరాజు, సామి పద్మావతి, శ్రీదేవి, దాసరి మల్లి,పేరుస్వాముల శ్రీనివాస్, పాలడుగు నాగేశ్వరరావు, రాజా, చిరంజీవి, రమణ కిషోర్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు