తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
తెలుగు దేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు స్ధానిక మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం వద్ద కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజధాని రైతుల త్యాగాలకు విలువ లేకుండా మూడు రాజధానులు పేరుతో వారిని మానసికంగా వెదనక గురిచేస్తున్నా జగన్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ధి చెప్పతరని వారి కోసం పూర్తి స్ధాయిలో అండగా ఉంటామని అన్నారు. అనంతరం మండల రెవెన్యూ తహశీల్దారు రవిశంకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఆవులూరి యలమంద,ముల్లా ఖూద్దుస్, సయ్యద్ ఇమాంసా, షేక్ రసూల్, మీగడ ఓబుల్ రెడ్డి, షేక్ నజీర్ (గన్), బుడ్డు జిలానీ, జ్యోతి నాగమలేశ్వరరావు తెలుగు యువత నాయకులు షేక్ గౌస్ ముల్లా ఖాయ్యుం తదితరులు పాల్గొన్నారు