తహశీల్దారు కార్యాలయం వద్ద యుటియఫ్ ఆధ్వర్యంలో ధర్నా
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పిఆర్సీ ,డిఎలు మంజూరు, సిపియస్ రద్దు చేయాలని కోరుతూ తహశీల్దారు కార్యాలయం వద్ద గురువారం నాడు ధర్నా నిర్వహించి తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ కీ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా షేక్ అబ్దుల్ మాట్లాడుతూ పిఆర్సీ వెంటనే అమలు చేయాలని పెండింగ్లో ఉన్న ఆరు డి ఎ ను వెంటనే విడుదల చేయాలని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని , సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని అదే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతి నెల ప్రమోషన్లు ఇవ్వాలని రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల, ఉద్యోగులందరికీ వెంటనే వారికి ఆర్థిక ప్రయోజనాలైన పెన్షన్,ఎన్ క్యాష్ మెంట్ ,గ్రాట్యుటీ ,ఏపీ జి ఎల్ ఐ ,జి ఎస్ ఆర్థిక ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు.
కార్యక్రమంలో లో పొదిలి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాల కాశి రెడ్డి, ఎం. నాగార్జున జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు బుజ్జి బాబు, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ చావలంవెంకటేశ్వర్లు, కోనకన మెట్ల అధ్యక్షుడు చంద్రమౌళి యుటిఎఫ్ సీనియర్ కామ్రేడ్ పి. శ్రీనివాసులు రెడ్డి, దాసరి గురు స్వామి వేమూరి శ్రీనివాసులు, కాసు తిరుపతి రెడ్డి ,ప్రభాకర్ రెడ్డి పి ఆంజనేయ చౌదరి, గంట ఆంజనేయ రెడ్డి కె రాంప్రసాద్, మరిపూడి వెంకటరమణ , షేక్ కాసిం సా, పి సతీష్ ,కురివి సుబ్బారెడ్డి, బాల వెంకటేశ్వర్లు, బూడాల ప్రసాద్ ,గురవయ్య తదితరులు పాల్గొన్నారు