దాతృత్వాన్ని చాటుకున్న ఎస్ఐ సురేష్

పొదిలి పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ దాతృత్వాన్ని చాటుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు.

వివరాల్లోకి వెళితే పట్టణంలో రాత్రివేళ గస్తీ తిరుగుతూ పలుచోట్ల యాచకులుగా, అనాధాలుగా వీధుల్లో తిరుగుతూ ఎక్కడెక్కడో తింటూ సాయంత్రానికి రోడ్ల పక్కన, గుడుల పరిసరాల్లో ఏ దిక్కులేకుండా బ్రతుకుతున్న వారిని కలిసి వారు ఎక్కడినుండి వచ్చారు, ఎలా బ్రతుకులు వెళ్ళదిస్తున్నారు అనే అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఏ దిక్కు లేనివారికి దేవుడే దిక్కు అన్నట్లుగా కాలం వెళ్ళదిస్తున్నామని తెలిపిన మాటలకు చలించిపోయిన ఎస్ఐ సురేష్……

చలికాలంలో కావడంతో తనవంతు సహాయం చేయాలని అనుకున్న ఆయన చలికి వణుకుతూ అగచాట్లు పడుతూ నిద్రిస్తున్న వారికి దుప్పట్లను పంపిణీ చేసి తనలోని దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న పలువురు దయనీయ స్థితిలో ఉన్న వారిపట్ల ఎస్ఐ సురేష్ చూపిన చొరవ ఆదర్శనీయమని ప్రశంసించారు….. ఇటువంటి సేవలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు.