నేర పరిశోధన పై అవగాహన సదస్సు నిర్వహించిన దిశా డి.ఎస్.పి

నేర పరిశోధనలో తీసుకోవలసిన జాగ్రత్తలు మేలుకువలుపై దిశా డి.ఎస్.పి ధనుంజయ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే సోమవారం నాడు పొదిలి పట్టణంలోని మంజునాథ కళ్యాణ మండపము నందు సిఐ సుధాకర్ రావు అధ్యక్షతన తో సర్కిల్లోని ఎస్ ఐ లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డి.ఎస్.పి ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ ఇన్వెస్టిగేషన్లో మెలుకువలు నేరపరిశోధన లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ముఖ్యమని తప్పనిసరిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు

ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్సైలు మరియు పోలీసులు తదితరులు పాల్గొన్నారు