దిశా మహిళా రక్షణ మా బాధ్యత : సిఐ సుధాకర్
దిశా మహిళా రక్షణ మా బాధ్యత అని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు అన్నారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణం దరిశి రోడ్ లోని మంజునాథ కళ్యాణ మండపం నందు శనివారం నాడు పొదిలి యస్ ఐ సురేష్ అధ్యక్షతనతో దిశా మహిళా రక్షణ మీ భద్రత మా బాధ్యత సెమినార్ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు మాట్లాడుతూ పంచాయతీల వారీగా సర్పంచ్ తో పాటు నాలుగురితో కమిటీ ఏర్పాటు చేసి దిశా యాప్ లను డౌన్లోడ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్ మరియు పొదిలి మండల పరిధిలోని సర్పంచ్ లు సచివాలయాల సిబ్బంది, గ్రామ, వార్డు వాలంటీర్లు , పోలీసులు తదితరులు పాల్గొన్నారు