రేపు మండలంలో ఇంటి నివేశన స్థలాలు పంపిణీ

పొదిలి మండలంలోని నందిపాలెం, మాదాలవారిపాలెం, రామాయణ కండ్రిగ, సలకనూతల గ్రామాల నందు బుధవారం నాడు ఇంటి నివేశన స్థలాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి హాజరుకానున్నారని మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.