నేడు 420మందికి ఇంటి నివేశన స్ధలాలు పంపిణీ
పొదిలి మండలంలో శనివారంనాడు 420మందికి ఇంటి నివేశన పంపిణీ చేసినట్లు మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు తెలిపారు.
ఇంటి నివేశన స్థలాలు పంపిణీ కార్యక్రమంలో పొదిలి మండలం నందు శనివారం నుంచి పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి చేతులు మీదుగా లాంఛనంగా ప్రారంభించారు.
మండలంలో శనివారంనాడు ఆమదాలపల్లి,అన్నవరం,తలమల్ల, ఉప్పలపాడు, యేలురు గ్రామాల్లో
ఏర్పాటు చేసిన వైయస్సార్ జగనన్న కాలనీ నందు ఏర్పాటు సమావేశంలో అర్హులైన వారికి 420మందికి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, ఎంపిడిఓ శ్రీకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్, ఆర్ఐ శివరాం, వైకాపా నాయకులు జి శ్రీనివాస్ , కల్లం వెంకట సుబ్బారెడ్డి, ఉలవా గోపి మరియు వివిధ సచివాలయల సిబ్బంది ,హౌసింగ్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.