నాయీ బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

శ్రీ పార్వతి సమేత నిర్మామహేశ్వర స్వామి వారి రథోత్సవం సందర్భంగా స్థానిక పొదిలి పెద్ద బస్టాండ్ నందు నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయీ బ్రహ్మణ సంఘం ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ అన్నవరపు వెంకటేశ్వర్లను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రంగయ్య జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి నారాయణ జిల్లా నాయకులు చల్లంచర్ల రామకోటయ్య పొదిలి మండల నాయకులు ఈర్లపాటి ఆదినారాయణ, హనుమంతరావు, దర్శి గురవయ్య,, లక్ష్మీనారాయణ ,వెంకటేశ్వర్లు, నాని తదితరులు పాల్గొన్నారు