లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారంనాడు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక విశ్వనాథపురంలోని ప్రకాశ్ నగర్, ఇస్లాంపేట ప్రాంతాలలో లాల్ ఫౌండేషన్ చైర్మన్ అఖిబ్ అహ్మమద్ ఆధ్వర్యంలో పొదిలి సిఐ శ్రీరామ్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి యస్ఐ సురేష్, మండల వైసిపి నాయకులు జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, షేక్ నూర్జహాన్, లాల్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.