వివేకానంద విద్యాసంస్థల ఆధ్వర్యంలో విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ
వివేకానంద విద్యాసంస్థల ఆధ్వర్యంలో విలేకరులకు నిత్యావసర సరుకులను స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి పంపిణీ చేశారు.
వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ మరియు డైరెక్టర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కశిరెడ్డి వెంకట రమణారెడ్డి, కంభం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారంనాడు స్థానిక విశ్వనాథపురంలోని వివేకానంద విద్యాసంస్థ నందు మండలంలో పనిచేస్తున్న ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, కేబుల్ టీవీ ఛానెల్ నందు పనిచేస్తున్న విలేకరులకు 25 కిలోల బియ్యం ఇతర నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కెవి రమణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ మూలంగా జాతీయ లాక్ డౌన్ విధించిన సందర్భంగా విలేకరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వార్తా సమాచారాన్ని సేకరించి ప్రజలకు చేరవేసే ప్రధాన భూమిక వహిస్తున్న విలేకరులకు “చిరుకనుక”గా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివేకానంద విద్యా సంస్థల సిబ్బంది, వైసిపి నాయకులు, విలేకరులు తదితరులు పాల్గొన్నారు.