పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
సోమవారం నాడు స్ధానిక రథం రోడ్ లోని జరిగిన కార్యక్రమంలో పొదిలి మండల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి చేతుల మీదుగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ రెడ్డి సౌజన్యంతో జిల్లా వ్యాప్తంగా మహిళలకు శిక్షణ ఇచ్చి అనంతరం వారికి కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు కల్లం వెంకట సుబ్బారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, జి శ్రీనివాసులు, గొలమారి చెన్నారెడ్డి, భూమ రమేష్, కొత్తూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు