అనిల్ జన్మదిన సందర్భంగా పేదలకు కూరగాయలు పంపిణీ మరియు అన్నదానం
తెలుగు దేశం పార్టి మండల నాయకులు స్నేహ పౌల్ట్రీ పండు చికెన్ సెంటర్ అధినేత పండు అనిల్ జన్మదిన సందర్భంగా శుక్రవారం నాడు స్ధానిక జాప్లాపురం గ్రామంలో కూరగాయలను పంపిణీ చేయగా పొదిలి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం చేసారు. తొలుత స్ధానిక పండు చికెన్ సెంటర్ నందు కేక్ కోసి మిత్రులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వెలిశెట్టి వెంకటేశ్వర్లు, వెలిశెట్టి నారాయణ, షేక్ గౌస్ , తిరుమల శెట్టి శ్రీను, సురేష్, వెంకట్రావు, నిరంజన్, రాంబాబు, పాపారావు, రోళ్ళా శ్రీను ,కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు