డిసెంబర్ 11వ తేదీన జిల్లాస్థాయి చెకుముకి సంబరాలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
18వ తేదీన మండల స్థాయి చెకుముకి ప్రతిభ పరీక్ష, డిసెంబర్ 11వ తేదీన జిల్లా స్థాయి చెకుముకి ప్రతిభ పరీక్ష నిర్వహించబడతాయని జిల్లా అధ్యక్షులు కాజా హుస్సేన్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక పొదిలి సిఐటియు ఆఫీసు నందు పొదిలి డివిజన్ అధ్యక్షులు డి చంద్రశేఖర్ అధ్యక్షతన ముందస్తు సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్, జయప్రకాష్ మాట్లాడుతూ సైన్స్ పట్ల అవగాహన, శాస్త్రీయ ఆలోచన, శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ అవగాహన, పెంపొందించుటకు ఈ చెకుముకి ప్రతిభ పరీక్ష ఎంతగానో తోడ్పడుతుందని ఈ ప్రతిభ పరీక్షలకు ప్రతి మండలం నుండి ప్రథమ స్థానం పొందిన ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు పాల్గొంటారని తెలిపారు.
జిల్లా ఉపాధ్యక్షులు దాసరి గురుస్వామి మాట్లాడుతూ డిసెంబర్ 11వ తేదీన పొదిలి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు ఉదయం 10 గంటల నుండి చెకుముకి సంబరాలు ప్రారంభమవుతాయని ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరవుతారని అదే రోజు విద్యార్థులందరికీ మంచి ఇంద్రజాల ప్రదర్శన ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొదిలి డివిజన్ ప్రధాన కార్యదర్శి బి దేవ ప్రసాద్ ట్రెజరర్ రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు కె ఎలమందరెడ్డి, చిట్టెంశెట్టి వెంకట సుబ్బారావు, పి ఆంజనేయ చౌదరి, కార్యదర్శి ఎం వి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కందుల రవికుమార్, జన విజ్ఞాన వేదిక పొదిలి అధ్యక్షులు సోమరాజు, యుటిఎఫ్ నాయకులు షేక్ అబ్దుల్ హై బాల కాశిరెడ్డి, నాగార్జున, సిఐటియు నాయకులు ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు