‘చదవడం మాకిష్టం’పై జిల్లా స్థాయి సెమినార్

విద్యార్ధుల కోసం ‘చదవడం మాకిష్టం’ పేరిట ప్రవేశపెట్టిన కార్యక్రమంపై విద్యాశాఖ ఆధ్వర్యంలో..మరియు ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి నేతృత్వంలో సెమినార్ నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలోని
శ్రీ సాయి బాలాజీ కళ్యాణ మండపంలో జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు,
మండల విద్యాశాఖాధికారులతో శనివారంనాడు ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర స్థాయి మానిటరింగ్ అధికారిణి పి పార్వతి, స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ రవీంద్ర రెడ్డి పలు సూచనలు సలహాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.